సీఎంతో సిపిఐ నాయకుల భేటీ
విశ్వంభర, హైదరాబాదు : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం. బాలనరసింహ, వి.ఎస్. బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. కనీస వేతనాల పెంపును పునఃసమీక్షించి సవరించాలని, సింగరేణి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. రైతు భరోసా మిగిలిన సాయం వెంటనే విడుదల చేయాలని, మొక్కజొన్న కొనుగోలు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా లాటరీ పద్ధతిలో చేయాలని, భూదాన, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రతినిధి బృందం కోరింది.