పొలాలలో పంట అవశేషాలను కాల్చకండి: ఎస్ఐ నరేష్
విశ్వంభర, త్రిపురారం : వ్యవసాయ పనులు పూర్తయిన అనంతరం పొలాల్లో మిగిలి ఉన్న చెత్తాచెదారం, పంట అవశేషాలు గడ్డి వంటి వాటికి రైతులు నిప్పు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని త్రిపురారం ఎస్ ఐ నరేష్ సూచించారు. పొలాల్లో మంటలు పెట్టడం వలన ఆ మంటలు అదుపు తప్పి సమీప గ్రామాలు, నివాస ప్రాంతాలు మరియు ఇతర వ్యవసాయ క్షేత్రాలకు వ్యాపించి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో గాలి వేగంగా వీచే పరిస్థితుల్లో చిన్న మంట కూడా పెద్ద అగ్ని ప్రమాదాలకు దారితీస్తోంది.అదేవిధంగా, పంట అవశేషాలను కాల్చడం వలన భూమిలో ఉండే సహజపోషకాలు,సేంద్రియపదార్థాలు మరియు పంటలకు ఉపయోగపడే సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీని ప్రభావంతో భూమి సారవంతత తగ్గి, భవిష్యత్తులోపంటదిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.కావున రైతులుపంటఅవశేషాలనుకాల్చివేయకుండా వాటిని సేంద్రియఎరువులతయారీలో వినియోగించడం లేదా శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం చేయాలని సూచించారు. ప్రజలు, రైతులు అగ్ని ప్రమాదాల నివారణలో బాధ్యతగా వ్యవహరించి గ్రామాల్లో సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖకు సహకరించగలరని కోరారు.