ధరల నియంత్రణలో కేంద్రం విఫలం

ధరల నియంత్రణలో కేంద్రం విఫలం

విశ్వంభర, హైదరాబాదు : పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం  మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. గత 12 రోజులలోనే పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు 8 రూపాయల వరకు పెంచడం భారమని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, వ్యవసాయ ఖర్చులు కూడా అధికమవుతాయని తెలిపారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/center-failed-to-control-prices/article-15883

Tags: