ఆసిఫ్ నెహర్ కాలువ మరమ్మతుల్లో జాప్యం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని గ్రామాల గుండా వెళ్ళే పురాతన ఆసిఫ్ నెహర్ కాలువ మరమ్మతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంకా పూర్తికాక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలువ మరమ్మతుల పేరుతో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు పనులను వేగంగా పూర్తి చేయడంలో విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నారు పోసుకొవడానికి కృత్తిక, రోహిణి కార్తెలను ఉత్తమమైనవిగా రైతులు భావించి తమ వ్యవసాయ పనులు మొదలూ పెడతారు. మే నెల 25 నుండి రోహిణి కార్తె మొదలైంది. కానీ సాగు పనులు ప్రారంభించాల్సిన సమయంలో నీరు అందకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొంది. ఖరీఫ్ సీజన్‌కు ముందే కాలువ మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉండగా, ఈసారి పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. కాలువల్లో పూడిక తొలగింపు, గండ్ల పూడ్చివేత, చెదిరిపోయిన గోడల మరమ్మతులు వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనివల్ల రైతులు నారుమడులు వేయడం, భూమి దున్నడం వంటి వ్యవసాయ పనులు చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం పూర్తిగా సాగునీటి కాలువలపైనే ఆధారపడే రైతులకు ఈ పరిస్థితి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. సమయానికి నీరు అందకపోతే విత్తనాల విత్తకం ఆలస్యం అవడంతో దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాల ధరలు పెరిగి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సాగునీటి సమస్య మరింత భారంగా మారింది. అధికారులు కేవలం మరమ్మతుల పేరుతో పనులు ప్రారంభించడం కాకుండా వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలి. అవసరమైతే అదనపు సిబ్బంది, యంత్రాలను వినియోగించి పనులను వేగవంతం చేయాలి. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కాబట్టి ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే కాలువ మరమ్మతులు పూర్తి చేసి సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.