సామినేని హత్యపై సిట్‌కు సీఎం హామీ

  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

విశ్వంభర, హైదరాబాదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు ప్రజా సమస్యలను వివరించింది. ఖమ్మం జిల్లా పాతర్లపాడు మాజీ సర్పంచ్, పార్టీ నాయకుడు సామినేని రామారావు హత్య కేసులో 7 నెలలు గడిచినా నిందితులను అరెస్ట్ చేయలేదని బృందం ఆందోళన వ్యక్తం చేసింది. బొర్రా ప్రసాద్, కంచుమర్తి, రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందని, సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా సేకరించాల్సి ఉందని బృందం వివరించింది. కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. కనీస వేతనాల సవరణలో అసమానతలు ఉన్నాయని, సెమీ-స్కిల్డ్, స్కిల్డ్, హై-స్కిల్డ్ కార్మికులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. జోన్ విధానాన్ని రద్దు చేసి వేతనాలను సవరించాలని కోరగా పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అసైన్డ్ భూములకు సమాన పరిహారం ఇవ్వాలని, రామోజీ ఫిలిం సిటీ పరిధిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, బఫర్ జోన్‌లలో ఇళ్ల కూల్చివేతలను నిలిపివేయాలని బృందం ప్రస్తావించింది. ఈ అంశాలపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని బృందం కోరగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఉద్యమాలు చేపడతామని బృందం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,  జ్యోతి ,మల్లు లక్ష్మి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cm-assures-sit-on-samines-murder/article-15887

Tags: