చెత్త సమస్య పరిష్కరించాలని కమిషనర్ కి వినతిపత్రం

విశ్వంభర, ఉప్పుగూడ:  జంగం మెట్  డివిజన్ శివ సాయి నగర్ లో స్ట్రీట్ నెంబర్ వన్ ప్రవేశద్వారం ముందు విపరీతంగా చెత్త వేయడం, కొన్ని సందర్భాల్లో కాలనీలోకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చెత్త పేరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయని, గతంలో చెత్త వేయడం జరగలేదు కానీ ప్రస్తుతం నిర్లక్ష్యంగా చెత్త వేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కావున తగిన చర్యలు తీసుకొని సమస్యని పరిష్కరించాలని వేడుకున్నారు. దీనిపై రాజేంద్రనగర్  జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి  వెంటనే స్పందించి సంబంధిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ముఖ్యంగా జంగం మెట్ ఆఫీసర్ కి వెంటనే సమాచారం అందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్న  శ్రీనివాస్ శివ సాయి నగర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్,  నవీన్ నక్కల అడ్వైజర్, శ్రీనివాస్, బాబురావు, సోలంకి తదితరులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petition-to-the-commissioner-to-solve-the-garbage-problem/article-15417

Tags: