క్షయవ్యాధి నివారణకు కృషిచేద్దాం

క్షయవ్యాధి నివారణకు కృషిచేద్దాం

  • కలెక్టర్ హైమావతి

విశ్వంభర, సిద్దిపేట: సిద్దిపేటను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, క్షయ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన విధంగా మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోతారం గ్రామం మండలం బెజ్జంకి వారి సౌజన్యంతో ఫుడ్ బాస్కెట్ పంపిణీ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో ధనరాజ్‌తో కలిసి అర్బన్ హెల్త్ సెంటర్ నాసర్‌పురా‌లో సోమవారం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాధిని జయించి టీబీ ఛాంపియన్‌గా మారొచ్చని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులతో పాటు ఆరు నెలలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిల్లా ఇండస్ట్రియల్ సెంటర్ జనరల్ మేనేజర్ గణేష్ రామ్, వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాజీ నాల్కర్ వారి సౌజన్యంతో ఏడు రకాల పోషక విలువలున్న ఆహార బుట్టలను (ఫుడ్ బాస్కెట్) క్షయ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ నిర్మల రెడ్డి, డాక్టర్ వినోద్ బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్, డెమో నవీన్ రాజ్, హెచ్ఈ సత్యనారాయణ, సూపర్వైజర్లు రాజేందర్, రమణ, రాజు, మల్లయ్య, తిరుపతి రెడ్డి, ఆరోగ్య సిబ్బంది ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-work-to-prevent-tuberculosis/article-15881

Tags: