బెలిదే శ్రీనివాసును అత్యధిక ఓట్లతో గెలిపించాలి : నివేదిత లక్షాధి

 విశ్వంభర, సూర్యాపేట: బెలిదే శ్రీనివాసును అత్యధిక ఓట్లతో గెలిపించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి కోరారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్ లో బెలిదే శ్రీనివాసుకు మద్దతుగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి బెలిదే శ్రీనివాసు కట్టుబడి పనిచేస్తున్నారని, పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నారని అన్నారు. కర్మకాండ భవనం నిర్మాణం, అంబులెన్స్ సౌకర్యం, పేద కుటుంబాల వివాహాలకు సహాయం, ఉచిత ఫ్రీజర్ బాక్స్, భోజన సదుపాయం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా సహాయం, ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం, వ్యాపారులకు రుణ సదుపాయం, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బెలిదే శ్రీనివాసు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని, అందుకే బెలిదే శ్రీనివాసును అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సత్యనారాయణ, ఉప్పల శ్రావణ్, గుండ వెంకన్న,సోమ వెంకన్న, సోమ ప్రవీణ్, కందిబండ ఉమ మహేశ్వరరావు,రాచకొండ శ్రీనివాస్, ప్రవీణ్ మొరిశెట్టి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nivedita-lakshadhi-should-win-belide-srinivasa-with-maximum-votes/article-15956

Tags: