కొట్లాడే దమ్ము ఒక్క  టీయూడబ్ల్యూజే ఐజేయు కే ఉంది 

జిల్లా మీడియా  అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు

 విశ్వంభర, సూర్యాపేట: జర్నలిస్టులను కష్టకాలంలో ఆదుకొని, వారి సమస్యలను పరిష్కరించి వారికి  అండదండగా ఉండేది కేవలం టియుడబ్ల్యూజే ఐజేయు మాత్రమే అని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  సోమవారం ప్రజా జ్యోతి తెలుగు దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దోసపాటి అజయ్ కుమార్, ధర్మ గంట తెలుగు దినపత్రిక జిల్లా స్టాపర్ మామిడి శంకర్, స్థానికం తెలుగు దినపత్రిక జిల్లా స్టాపర్ అజ్మీర విక్రమ్ నాయక్, మామిడి రవి, వెంకన్న తదితరులు టి యు డబ్ల్యూ జే ఐజేయులో సభ్యత్వం తీసుకున్న సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు ఇలా ఏ జర్నలిస్టుకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాల కోసం అతిపెద్ద సంఘం అయిన టీయూడబ్ల్యూజే ఐజేయు కృషి చేస్తుందని వివరించారు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ చీలికలు పేలికలు అవుతున్న సంఘాలు, గుర్తింపు లేని సంఘాలు, అధికారిక గుర్తింపు కోల్పోయిన సంఘాల వారు చెప్పే మాయమాటలకు జర్నలిస్టులు మోసపోవద్దని హితవు పలికారు. జర్నలిస్టుల కోసం కొట్లాడే దమ్మున్న ఏకైక సంఘం టి యు డబ్ల్యూ జే ఐజేయు మాత్రమే అని స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ జిల్లాలో టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ క్యాంపెయిన్ కు అనూహ్య  స్పందన లభిస్తుందని, మరో రెండు రోజుల్లో సభ్యత కార్యక్రమం ముగుస్తున్నందున ఇంకా ఎవరైనా జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే ఐజేయు సంఘంలో చేరాలనుకుంటే జిల్లా, ఆయా మండలాల బాధ్యులను సంప్రదించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయకుమార్, జిల్లా నాయకులు పులుసు నాగరాజు, సుంకర పోయిన వెంకటయ్య, కందుల నాగరాజు, తండు వెంకన్న, షేక్ రషీద్, ఉయ్యాల నరసయ్య, లింగాల సాయిబాబా, దుర్గం బాలు, వెంకన్న, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/only-twj-ij-has-the-guts-to-fight/article-15921

Tags: