గోనబోయినపల్లి కి బస్సు సర్వీసును పునరుద్ధరించాలి 

విశ్వంభర, డిండి:  మండలం పరిధిలోని గోనబోయినపల్లి గ్రామానికి తక్షణమే ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని  కోరుతూ గ్రామ నాయకులు, ప్రజలు సోమవారం దేవరకొండ డిపో మేనేజర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, పాఠశాల లు నడిచినరోజులలో మాత్రమే బస్సులు నడుస్తాయని, వేసవి సెలవుల కారణంగా బస్సు సర్వీసులను నిలిపివేసారని అన్నారు.గ్రామంలో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల వైద్యం కోసం మండల కేంద్రం అయిన డిండి కి ,దేవరకొండ పట్టణానికి వెళ్లే రోగులు, వృద్ధులు  కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో బస్సు సర్వీసులను నడపాలని వారు కోరారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని డీఎం దృష్టికి తీసుకెళ్లారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. రూట్లను పరిశీలించి, త్వరలోనే గోనబోయినపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోనబోయినపల్లి గ్రామ ముఖ్య నాయకులు గడిగ అర్జున్, రాసాలబద్రి, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bus-service-to-gonaboinapalli-should-be-restored/article-15895

Tags: