మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి
- ఎంపీడీవో పార్థసారథి
- కోమటిపల్లి అయ్యగారి పల్లిల్లో మహిళా భవనాలకు శంకుస్థాపన
విశ్వంభర, ఇనుగుర్తి: మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో బండారు పార్థసారథి తెలిపారు. మండలంలోని కోమటిపల్లి, అయ్యగారి పల్లి గ్రామాలలో ప్రభుత్వం సెర్ఫ్ మహిళా శక్తి భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనం రూ.10 లక్షల తో నిర్మించనున్న బిల్డింగులకు సోమవారం కోమటిపల్లి లో ఎంపీడీవో బండారు పార్థసారథి, సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్, అయ్యగారి పల్లిలో సర్పంచి మలిశెట్టి శోభన్ భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచి లు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళల ఆర్థిక,సామాజిక సాధికారత కు, స్వయం సహాయకసంఘాలసమావేశాలు,శిక్షణ,సంఘాల సమావేశాలుతదితర ఉపయోగాలకు భవనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోమటిపల్లి లో సర్పంచ్ బిక్షపతి గౌడ్,ఏపీఎం కృష్ణమూర్తి,జిపి కార్యదర్శి రమణ మూర్తి,ఉపసర్పంచి ఇస్లావత్ బాబు,మాజీ సర్పంచి నీలం యాకయ్య,వార్డ్ మెంబర్ యాకూబి, వివో ప్రతినిధులు సుహాసిని,శిరీష, సావిత్రి, వివిధ పార్టీల నాయకులు కూరెల్లి సతీష్, యాకమూర్తి,వెంకన్న, బాలు,రమేష్ తదితరులు పాల్గొనగా అయ్యగారి పల్లిలో సర్పంచి శోభన్, పంచాయతీ కార్యదర్శి హరీష్, సిసి బొడ్డు వెంకటేశ్వర్లు, వివో ప్రతినిధులు మంజుల వివో ఏ యాకలక్ష్మి వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.