మహిళా సాధికారతకు “ఇందిరా మహిళా శక్తి” తో కొత్త దిశ

  •  సూర్యాపేట  మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది 

 విశ్వంభర, సూర్యాపేట:  మున్సిపాలిటీ పరిధిలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్లమ్ స్థాయి సమాఖ్యలు, పట్టణ సమాఖ్యల సర్వసభ సమావేశాలు మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సోమవారం 24వ వార్డు లో వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాల్లో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, మెప్మా పిడి హనుమత్ రెడ్డి లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక భద్రత మరియు సాధికారత లక్ష్యంగా “ఇందిరా మహిళా శక్తి” పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల్లో లేని పేద, నిరుపేద మహిళలను గుర్తించి కొత్తగా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం, వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడం, స్వయం ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా వారి జీవనోపాధులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు.స్లమ్ స్థాయి సమాఖ్యలు, పట్టణ సమాఖ్యలు, స్త్రీ నిధి వడ్డీ లేని రుణాలు మరియు ఇతర ఆర్థిక సహాయ పథకాల ద్వారా మహిళలు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి యం సి రమేష్ నాయక్, శ్వేత, సువర్ణ,జిల్లా కోఆర్డినేటర్లు , మున్సిపల్ అధికారులు, ఆర్ పి లు షభానా, యశోద , నాగరాణి,మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/new-direction-for-women-empowerment-with-%E2%80%9Cindira-mahila-shakti%E2%80%9D/article-15960

Tags: