వనపర్తి డిఎస్ఓ అక్రమాల వల్ల ప్రభుత్వం ఆప్రతిష్టపాలు 

  •  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

విశ్వంభర, బషీర్ బాగ్: వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి, అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం  బషీర్ బాగ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వనపర్తి జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు ధాన్యం కొనుగోలులలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకు ప్రధాన కారణం డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అని ఆరోపించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారని, ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే రైతుల సమస్య జటిలమవుతుందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల 70 వేల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారనే ముందస్తు నివేదిక ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో వనపర్తి డిఎస్ఓ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని విమర్శించారు.ఇటీవలే టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలో రెండు రైస్ మిల్లులపై తనిఖీలు జరపగా వాటిలో రూ.9 కోట్లకు పైగా ధాన్యం మాయమైనట్లు గుర్తించడం జరిగిందన్నారు. ధాన్యం మాయం చేసిన మిల్లులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారే కానీ అందుకు బాధ్యుడైన కస్టోడియన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.పూర్తిగా అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిన వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ ను జిల్లా కలెక్టర్ ఎందుకు వెనకేసుకొస్తున్నాడో జిల్లా ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. సిబిఐ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని, అదేవిధంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ సమావేశంలో  జెఎసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు రేనట్ల మల్లేష్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు శ్రీధర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/vanaparthi-dsos-irregularities-have-brought-the-government-into-disrepute/article-15875

Tags: