మిర్యాలగూడ పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
విశ్వంభర, మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డు లలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం, పేదకుటుంబాలకు చెందిన ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. నేడు పట్టణంలోని మహిళలకు స్వయంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంఎంతోసంతోషాన్నిచ్చింది.రాష్ట్రంలో ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేదే మన ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా నుంచి మహిళల, పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. అంతేకాదు సహకారక సంఘాలలో పనిచేసే మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది అని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురానుంది అని అన్నారు. అర్హులైన ప్రతి మహిళకూ ఈ సంక్షేమ పథకాలు అందేలా శాసనసభ్యుడిగా నేను , మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.