రైతులు సంయమనం పాటించాలి

రైతులు సంయమనం పాటించాలి

  • కలెక్టర్ హైమావతి విజ్ఞప్తి 

విశ్వంభర, సిద్దిపేట: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని రైతులు సంయమనం పాటిస్తూ అధికారులతో సహకరించాలని కలెక్టర్ హైమావతి విజ్ఞప్తి చేశారు. సోమవారం కోహెడ మండలంలోని వెంకటేశ్వరపల్లి ఆధునిక మార్కెట్ కమిటీ, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలోని గోదాములో ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతుందని వేగవంతం చేయడానికి మిల్లులకు కాకుండా అందుబాటులోని గోదాంలో ప్రస్తుతానికి దిగుమతి చేస్తున్నామని తెలిపారు. కోహెడలోని గోదాం వద్ద ధాన్యం ట్రాక్టర్ లైన్ చాలా పెద్దదిగా ఉన్నందున ప్రతీ ట్రాక్టర్‌కు టోకెన్ ఇచ్చి ప్రణాళిక ప్రకారం వేగంగా దిగుమతి చేసేలా పనిచేయాలని మార్కెట్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం చేర్యాల మార్కెట్ కమిటీని పరిశీలించి చేర్యాల ఏఏంసీలో ధాన్యాన్ని మొత్తం గోదాంలో దిగుమతి చేసిన తర్వాతనే వేరే సెంటర్ల నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. హమాలీ, లారీల కొరత ఉన్నందున వేగంగా జరగడం కోసం అధికార యంత్రాంగం శాయశక్తిలా పనిచేస్తుందని సంయమనం పాటిస్తూ సహకరించాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-should-exercise-restraint/article-15885

Tags: