సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి

సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి

విశ్వంభర, అమీర్ పేట: సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి అని కవులు పేర్కొన్నారు. సాహితీ కౌమిది సాహితీ సాంస్కృతిక సభ ఆధ్వర్యంలో హైదరాబాదు మోతి నగర్‌లోని రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిటి జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఎలిపి రత్న ప్రసాద్ తన కవితలను వినిపించి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం హాస్యబ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ, లయన్ వివి రాఘవ రెడ్డి, ఆచార్య మనస చెన్నప్ప, డాక్టర్ రాధా కుసుమ, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య, మాన్యశ్రీ మల్లిక్ చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అంజన కుమార్ అధ్యాపకులు, కవులు అభినందించారు. కార్యక్రమంలో సాహిత్యాభిమానులు, కవులు పాల్గొన్నారు.

Tags: