అరెస్టులపై బీజేపీ ఆగ్రహం
On
విశ్వంభర, హిమాయత్‌నగర్ : అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందు బీజేపీ నాయకులను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నేతలు ఖండించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ధరల భారంపై ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రతిపక్షాలను అణచివేయడానికే ప్రయత్ని స్తోందని విమర్శించారు. అరెస్టులు మమ్మల్ని ఆపలేవు. ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవర్ధన్ బొంగిరి, సౌదా రమేష్, మహేష్ పజపతి, కేశబోయిన శ్రీధర్, మాధవి, బల్వీర్, నర్సింగ్ గౌడ్, నందు భాయ్ తదితరులు పాల్గొన్నారు



