కమ్యూనిస్టులే ప్రజలకు అండ

  •  : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

విశ్వంభర, ముషీరాబాదు: ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, డీఏలు చెల్లించి పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా తగిన వేతనాలు లభించడం లేదని విమర్శించారు. ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యూసుఫ్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే.రవిచంద్రన్, కే.ఏసురత్నం, వనంపల్లి జైపాల్ రెడ్డి, కాంతారావు, హరినాథ్ రావు, ఎం.నరసింహ, ఓమయ్య, విలాస్, పల్లె దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు