ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు

ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా,  ఉస్మానియా యూనివర్సిటీ  మరియు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య(CATCO) సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, సెమినార్ హాల్లో "డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం" వారోత్సవాలలో భాగంగా 20-12-2025  అంశం: "Efficient and Speedy Disposal Through Digital justice"   అంశంపై జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య  ప్రధాన కార్యదర్శి ఏల. వెంకటేశ్వర్లు అతిధులను వేదిక పైకి గౌరవంగా ఆహ్వానించడం జరిగినది,  జ్యోతి ప్రజ్వలన  తో కార్యక్రమం ప్రారంభమైనది, సభ అధ్యక్షులుగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రాంప్రసాద్,  ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఓయూ  వారి సందేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం డిజిటల్ విధానం సంత్వర పరిష్కారం ఎలా జరుగుతుందో అనే విషయంపై, జాగో భారతి యాప్, జాగో భారతి డాష్ బోర్డు, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ ద్వారా 17 భాషలలో వినియోగదాల సమస్యలను పరిష్కారం చేయడం కోసం నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్  1915  మరియు 8800001915 వీటిని వినియోగించుకుని వినియోగదారులు తమ సెల్ ఫోన్ల ద్వారా సమస్యలను  సత్వరంగా పరిష్కారం పొందవచ్చని  అనేక విషయాలపై వివరంగా వివరించడం జరిగింది,  ముఖ్య అతిథిగా సి . పార్థసారథి ఐఎఎస్ విశ్రుత ఎన్నికల కమిషన్ కమిషనర్, తెలంగాణ ప్రభుత్వం  వినియోగదారులు హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం,  ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్లో కొనుగోలు  చేయడం వల్ల వినియోగదారులు మోసపోతున్నారు.  షాపింగ్ మాల్స్ కొనుగోలు చేసే వస్తువులు ఏ విధంగా ఉంటున్నాయి, వినియోగదారులు ఏలా  మోసపోతున్నారు,  లా కాలేజ్ విద్యార్థులను ఉద్దేశించి రాబోయే రోజులలో న్యాయ వాదులుగా మీరు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో   పేరు ప్రఖ్యాతులు పొందాలని, ఇప్పటికే మనదేశ న్యాయవాదులు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నత పదవులలో ఉన్నారని,   న్యాయ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.  ప్రొఫెసర్ డాక్టర్.ఎన్ . వెంకటేశ్వర్లు డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ లా, ఓయూ.   గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే విధంగా భవిష్యత్తులో కూడా  తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య క్యాట్కోతో కలిసి మరెన్నో చైతన్య కార్యక్రమాలు రాబోయే రోజులలో నిర్వహిస్తామని తెలియపరచడం జరిగింది.   శంకర్ లాల్  చౌరసియా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య(CATCO) అధ్యక్షులు వేముల గౌరీ శంకర్ రావు,  ప్రముఖ న్యాయవాది గౌరవ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య అనేక విషయాల తెలియపరచడం జరిగింది. K.శ్రీనివాస్ గారు DCSO  హైదరాబాద్ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం, వివరంగా వివరించడం జరిగింది,  ఈ  సమావేశంలో వివిధ లా కళాశాలల విద్యార్థులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, కళాశాలల అధ్యాపకులు హాజరవ్వగా ప్రముఖులు హక్కుల పరిరక్షణ చట్టం గురించి మరియు వినియోగదారుల హక్కులు బాధ్యతలు గురించి వివరంగా వివరించడం జరిగింది, ప్రస్తుతం సమాజంలో వినియోగదారులు  ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై విపులంగా వివరంగా వివరించడం జరిగింది, అనంతరం టెక్నికల్ స్టేషన్లో ప్రత్యేకంగా వివిధ అంశాలపై  సెక్షన్లు  భాగంగా ముందుగా  వేముల గౌరీ శంకర్ రావు  వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ పై వివరించడం జరిగింది, అనంతరం స్టేషన్లో  ప్రొటెక్షన్ ఆఫ్  కన్జ్యూమర్  ఫ్రం సైబర్ క్రైమ్ గురించి  S.తులసి రామ్  విపులంగా వివరించడం జరిగింది, అనంత  మెడికల్ నెగ్లిజెన్సీ పైన Dr. శ్రీ Ch.రాజేందర్ MBBS, DCH, LLB, PhD in Medical Malpractice  అనంతరం ప్రొటెక్షన్ ఆఫ్ కన్స్యూమర్ E-Commerce  గురించి  N. శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఏరా ఈ కామర్స్ పై జరిగే మోసాలపై వివరంగా వివరించారు, అనంతరం కల్తీలపై  టి. విజయ్ కుమార్  విశ్రుత డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ FSSAI తెలంగాణ ప్రభుత్వం, కల్తీలు ఎలా జరుగుతున్నాయి  వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై వివరంగా వివరించడం జరిగింది, ముగింపు సమావేశం  ప్రొఫెసర్. డాక్టర్.N. రాంప్రసాద్  నిర్వహించారు, ముఖ్యఅతిథిగా జస్టిస్ .MSK. జైస్వాల్ విశ్రుత ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూట్  రెడ్రసల్ కమిషన్  ప్రస్తుత చైర్మన్ అడ్వైజరీ బోర్డ్  ఆఫ్ డిటెన్షన్ కేసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS  వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలపై PV. శ్రీకాంత్  డైరెక్టర్ అండ్ హెడ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS  హైదరాబాద్ శాఖ,   మరియు  K. శ్రీనివాస్ DCSO  డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్  ప్రొఫెసర్ డాక్టర్ N. వెంకటేశ్వర్లు గారు Dean, Faculty of Law,OU   అనంతరం అతిధులను సన్మానించుకోవడం జరిగింది.  సమావేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఓపిగ్గా ఉన్నటువంటి విద్యార్థులకు వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ   పార్టిసిపెంట్స్  సర్టిఫికెట్స్  అందజేయడం జరిగింది. ఈ  సమావేశం నిర్వహణలో కృషి చేసిన OU Law College విభాగం సిబ్బంది,  పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ ASO లకి మరియు వారి సిబ్బందికి  తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య నల్లగొండ జిల్లా నుండి వచ్చినటువంటి కార్యకర్తలకు, మరియు ఆదిలాబాద్ నుండి వచ్చినటువంటి వినియోగదారుల సంఘాల కార్యకర్తలు సంతోష్ కుమార్ కి, వరంగల్ నుండి విచ్చేసిన ఠాగూర్ రతన్ సింగ్ కి, మరియు  వరంగల్ జిల్లా వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు, సిద్దిపేట నుండి రవీందర్ విచ్చేసినటువంటి కార్యకర్తలు కె. విశ్వధర్ రాజ, AVS దీక్షిత్, ఉపాధ్యక్షులు  D. గోపాల నారాయణ మరియు వారి మిత్రబృందం, క్యాట్కో ఉపాధ్యక్షురాలు M. భాగ్యవతి వారి మిత్ర బృందం A.శివ పార్వతి, శ్యామల P. సోమయ్య తదితర కార్యకర్తలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటు  శంకర్ లాల్  చౌరసియా చైర్మన్ CATCO  అనంతరం వందన సమర్పణ  OU ప్రొఫెసర్ Dr. రత్నాకర్  వందన సమర్పణ తో సమావేశం ముగిసింది. 

Tags: