చండూరు ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ గా చెరుపల్లి ఆంజనేయులు 

విశ్వంభర, చండూర్ :- గతంలో చండూరు FSCS చైర్మన్ గా ఉన్న కోడి సుష్మ గారు చండూరు మున్సిపాలిటి కౌన్సిలర్ గా ఎన్నిక అయిన నేపథ్యంలో  చండూరు FSCS చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో చండూర్  FSCS  నాన్ ఆఫీసియల్ సభ్యుల నుండి ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు నిర్వహించారు..గట్టుపల్ గ్రామానికి చెందిన డైరెక్టర్ చెరుపల్లి ఆంజనేయులు  ను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా అతనిని ఎనిమిది మంది డైరెక్టర్లు  ఆమోదించడంతో చైర్మన్ గా ఎంపికయ్యారు... ఎంపిక ప్రక్రియను  జిల్లా సహకార శాఖ అధికారి ఆదేశాల మేరకు  FSCS అధికారులు ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు.  చండూరు FSCS లో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా  గట్టుపల్ కు చెందిన దుబ్బ రాములు అనే డైరెక్టర్ డిఫాల్ట్ అవ్వడం, కోడి సుష్మ కౌన్సిలర్ గా ఎన్నిక కావడంతో  11 మంది డైరెక్టర్లు ఉన్నారు.. వీరిలో 8 మంది చెరుపల్లి ఆంజనేయులకు ఆమోదం తెలపడంతో  చెరుపల్లి ఆంజనేయులు ను చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. చైర్మన్ గా ఎంపికైన  చెరుపల్లి ఆంజనేయులకు  మాజీ చైర్మన్ కోడి సుష్మ తో పాటు డైరెక్టర్లు  చండూరు మండల ప్రముఖులు చండూరు పట్టణ ప్రముఖులు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు..ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు , కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు మండల, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

🕒 20 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chandur-fscs-chairman-cherupalli-anjaneyu/article-16800

Tags: