పారుపల్లిలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

పారుపల్లిలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో  47వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా బూత్  అధ్యక్షులు పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి పాల్గొని నూతనంగా బిజెపిలోకి  తవిటి జితేందర్ రెడ్డిని  కండువా  కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47 వ సంవత్సరంలోకీ అడుగుపెట్టడం జరిగిందాని,  భారతీయ జనతా పార్టీ   అంత్యోదయ లక్ష్యంతో  చిట్ట చివరన పేద వర్గాలకు ఫలాలు అందించాలనే లక్ష్యంతో  ఏర్పడి రెండు సీట్ల నుండి నేడు దేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిలబెట్టే స్థాయికి ఎదిగిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం  రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల కుమారస్వామి, మండల మాజీ ప్రధాన కార్యదర్శి  తవిటి  రామ్ రెడ్డి, బూత్అధ్యక్షులు  ఏలూరు పవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: