ఇనుగుర్తి లో చలివేంద్రం ప్రారంభం

ఇనుగుర్తి లో చలివేంద్రం ప్రారంభం

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లో అక్షయపాత్ర ఫౌండేషన్ చిన్నాల ప్రశాంత్, చెడుపాక రఘు, గుజ్జునూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్సై గంగారపు కరుణాకర్,  సర్పంచి తమ్మడపల్లి కుమార్,వెటర్నరీ డా.రవీందర్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు,బాటసారులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు చిన్నల కటయ్య, నదునూరి ప్రశాంత్,దొడ్డ రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags: