భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విశ్వంభర, జంగమ్మెట్ డివిజన్ :-చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని జంగం డివిజన్లో ఈరోజు నరేష్ జనరల్ సెక్రెటరీఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవం గా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ చంద్రాయన గుట్ట బిజెపి ఇన్చార్జ్ కౌడి మహేందర్, విజయ్ కుమార్ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ, విజయ్ కుమార్ ఓబీసీ అధ్యక్షుడు, ఎస్టి జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్, జంగం మెట్ డివిజన్ అధ్యక్షుడుA ప్రభాకర్, కృష్ణ నాయక్ ఎస్ టి మోర్చా జనరల్ సెక్రెటరీ, ప్రవీణ్ కుమార్, జంగం మెట్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, జంగం మెట్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ మాజీ అధ్యక్షుడు కాపర్తి శ్రీనివాస్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



