ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రహదారులకు మహర్దశ

  • 338 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణకు శంకుస్థాపన 
  • -ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

WhatsApp Image 2026-07-07 at 9.01.07 PMWhatsApp Image 2026-07-07 at 9.00.42 PM

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రహదారులు, భవనముల శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న భారీ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనములు , సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని తొర్రుర్ గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోడ్డు విస్తరణ పనుల ద్వారా హైదరాబాద్ రూరల్ పరిధిలో ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు . రహదారులు మరియు భవనాల శాఖ రూరల్ సర్కిల్ పరిధిలోని హైదరాబాద్ ప్యాకేజీ-1 లో భాగంగా, రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నాలుగు వరుసల రోడ్లుగా వెడల్పు చేయుట, పటిష్టపరచుట మరియు నిర్వహణ పనులను చేపడుతున్నాము అని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక నిధుల నుండి రూ. 338 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగులు వేస్తున్నామని తెలియజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, ఏవిఎన్ రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Read More అయోధ్య కానుకల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలి

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ibrahimpatnam-constituency-is-a-mahardasha-for-roads/article-18203

Tags: