యాదయ్య హత్య కేసులో దోషులందరినీ అరెస్టు చేయాలి
విశ్వంభర, నాగర్‌కర్నూల్ : మంత్రాల పేరుతో దళితుడు కర్రోల్ల యాదయ్య హత్యకు పాల్పడిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేబల్లి గ్రామంలో హత్యకు గురైన యాదయ్య కుటుంబాన్ని మంగళవారం కెవిపిఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శించింది. అనంతరం స్కైలాబ్ బాబు మాట్లాడుతూ, ఈ కేసులో ఒకరితోనే దర్యాప్తు పరిమితం చేయకుండా, పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మూఢనమ్మకాల పేరుతో దళితులపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్న ఆయన, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, ఇల్లు, భూమి మంజూరు చేయడంతో పాటు యాదయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. కురుమయ్య, జిల్లా కార్యదర్శి పులిజాల పరుశరాములు, జిల్లా నాయకులు మంత్రి వెంకటయ్య, నవీన్, యాదయ్య భార్య కలమ్మ, కుమారుడు నరేష్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.