గుండాల చేనేత సహకార సంఘానికి నూతన పాలకవర్గం ఎన్నిక

విశ్వంభర, గుండాల:  యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు నూతన పాలకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నియమితులైన ఎన్నికల అధికారి, సహాయ రిజిస్ట్రార్ పి. నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జూలై 6న నిర్వహించిన పాలకవర్గ సభ్యుల ఎన్నిక అనంతరం, మంగళవారం  పదాధికారుల ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా చిందం ప్రకాష్, ఉపాధ్యక్షుడిగా ఆలే కృష్ణ, కార్యదర్శిగా వల్లాల సరస్వతి, కోశాధికారిగా కస్తూరి మధు ఎన్నికయ్యారు. నిర్వాహక కమిటీ సభ్యులుగా గోలి రమేష్, తాటి వెంకటేశం, దుడుక లింగమూర్తి, బిట్ల ఆనంద్, బొల్లం అనిత ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను సంఘ సభ్యులు, చేనేత కార్మికులు అభినందిస్తూ, సంఘ అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారి పి. నాగేశ్వర్ రెడ్డి విజయవంతంగా నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/election-of-new-governing-body-of-gundala-hand-weaver-co-operative/article-18242

Tags: