మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ప్రభుత్వ లక్ష్యం
- నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
విశ్వంభర, పెద్ద శంకరంపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఆర్థికంగా స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని బాల సధానం కేంద్రంలో జిల్లా మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో 'మిషన్ శక్తి - బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళల రక్షణ, విద్య, వారి సాధికారత కోసం 'బేటీ బచావో బేటీ పడావో' 'మిషన్ శక్తి' పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు కేవలం గృహిణులుగానే పరిమితం కాకుండా, తమ చేతి వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొంది కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ప్రోత్సాహకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మున్సిపల్ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మహిళల సంక్షేమానికి, వారి భద్రతకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత అధికారులు,బి రాజు, మహేష్ చౌహన్, మున్సిపల్ కౌన్సిలర్, రమేష్ చౌహన్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ,స్థానిక మున్సిపల్ ప్రజాప్రతినిధులు, నాయకులు,మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.