ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి
- : జి. రాంబాబు యాదవ్
విశ్వంభర, చిక్కడపల్లి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, తాత్కాలిక ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదు చిక్కడపల్లి కార్మిక శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జి. రాంబాబు యాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అనేక ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. జీతాలు ఆలస్యం కావడంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులను కూడా కొన్ని ఏజెన్సీలు సకాలంలో జమ చేయడం లేదని, దీనివల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న జీతాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలను విడుదల చేసి, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక శాఖ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంకంటి సుభాష్, యూనియన్ నాయకులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.