కీసరలో ఘనంగా ఆర్ పి ఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం
విశ్వంభర, మేడ్చల్: కీసర మండల కేంద్రంలో ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు బక్కని కుమార్ మాదిగ ఆధ్వర్యంలో 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి, మంద కృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీపీ రామారం సుజాత మాట్లాడుతూ, 32 ఏళ్ల ఉద్యమ ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో రాణించాలని సూచించారు. మండల ఇంచార్జ్ బుడిగే జగన్ మాదిగ మాట్లాడుతూ, విద్య ద్వారానే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని, ఎస్సీ వర్గీకరణ ప్రయోజనాలను విద్య, ఉపాధి రంగాల్లో వినియోగించుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్త శ్రీనివాస్, పూండ్రు కృష్ణ, పూండ్రు మల్లేష్, చినింగని శ్రీనివాస్, మొరుగు రామలింగం, పూండ్రు మహేష్ తదితరులు పాల్గొన్నారు.