పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి  ఆపన్నహస్తం

పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి  ఆపన్నహస్తం

విశ్వంభర, మహేశ్వరం : పేద రోగులకు ఆపన్నహస్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేదునూరు సహా పలు గ్రామాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్   చెక్కులను అందజేశారు.  అలాగే నాగారం గ్రామానికి చెందిన  సీనియర్ జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ కే ఎల్ ఆర్ ఆధ్వర్యంలో   కాంగ్రెస్ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కు మూడు రంగుల కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. బడంగ్ పేట, అల్మాస్ గూడ సహా పలు ప్రాంతాల్లోని కాలనీల సమస్యలు పరిష్కరించాలని సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కిచ్చెన్నగారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కాలనీల్లో సమస్యల పరిష్కరం కోసం రూ.30కోట్లు ప్రభుత్వ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు నాయకులు, పలు సంఘాల నేతలు కేఎల్ఆర్  కలిశారు. వివిధ సమస్యలపై చర్చించారు. ఈ  కార్యక్రమంలో నాగారం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం మండల్ మాజీ అధ్యక్షులు కావలి దశరథ , నందు పల్లి గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ వత్తుల నారాయణ, వై యాదగిరి,  తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chief-ministers-relief-fund-for-the-poor/article-18201

Tags: