ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి
- రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి: ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, హిమాయత్‌నగర్: రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని లిబర్టీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు సిఖిల్ పటేల్, శివకుమార్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించకపోవడంతో విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. బకాయిలు పేరుకుపోవడంతో ఉన్నత విద్యా వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, అనేక కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా కొన్ని మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, నిర్ణీత గడువులో కళాశాలలకు చెల్లించకపోతే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకుని, గతంలో అమలైన విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని, రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు, యువజన నాయకులు విద్యార్థి సంఘాల నేతలు రాజేందర్, నీలం వెంకటేష్, అనంతయ్య, అంజి, వంశీ, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.