రామన్నపేటలో ఘనంగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నోముల చిరంజీవి ఆధ్వర్యంలో డాక్టర్. మందకృష్ణ మాదిగ పుట్టిన రోజును స్థానిక సుభాష్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. పుట్టిన రోజును పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు రోగులకు పండ్ల పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ, 33 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి వర్గీకరణ సాధించిన ఘనుడు మందకృష్ణ మాదిగ అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఈర్లపల్లి మల్లయ్య, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, సురేందర్రావు, బొడ్డు శంకరయ్య, మేడి శంకరయ్య, నకరికంటి మొగులయ్య, కొమ్ము రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇతర ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.