సోషల్ మీడియా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ పై అవగాహన సదస్సు
విశ్వంభర, శంషాబాద్: విద్యార్థులు సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సందీప్ అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని శంషాబాద్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏబీవీపీ) శంషాబాద్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనతో పాటు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, నేటి యువత దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని, అలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, వ్యక్తిత్వ వికాసం, దేశసేవ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య, సమాజ నిర్మాణం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం పోరాడుతోందని, విద్యార్థుల్లో జాతీయత, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలి, వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. అలాగే డ్రగ్స్‌కు దూరంగా ఉండి చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక అవగాహన కూడా ఎంతో అవసరమని, ఏబీవీపీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అభినందించారు.ఈ కార్యక్రమంలో నగర సంఘటన కార్యదర్శి పరుశురాం, నగర కార్యదర్శి బత్తుల భరత్, నగర కార్యకర్తలు దక్ష్, తిరుపతి, మనీష్,వేణు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.