నల్లగుట్ట తండాలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
విశ్వంభర, నెల్లికుదురు: గ్రామపంచాయతీ పరిధిలోని నల్లగుట్ట తండా తో పాటు సపవత్,భోజ్య, జాదు తండాలలోని రోడ్లకు ఇరువైపులా ఉండబడిన కంప చెట్లను చెత్తను స్థానిక సర్పంచి జెసిబి యంత్రం,ట్రాక్టర్ తో మంగళవారం తొలగించారు.ఈ సందర్భంగా సర్పంచి గుగులోతు హేమలత మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా కంపచెట్లు గుబురుగా పెరిగి రోడ్ల దారికి అడ్డు రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పరిశుభ్రంగా ఉండడానికి కంపచెట్ల తో పాటు అపరిశుభ్రంగా ఉన్న చెత్తను సైతం తొలగిస్తున్నట్లు తెలిపారు.చెత్త చెదారంతో దోమలు విజృంభించే అవకాశం ఉన్నందున యంత్రంతో తొలగించామన్నారు.సపావట్ తండా వద్ద రహదారి రెండు వైపుల గల పెంటలను సైతం తొలగించడంతో రోడ్డు వెడల్పుగా పరిశుభ్రంగా కనిపిస్తూ వాహనాలకు ఇబ్బందులు లేకుండా తొలగిపోయింది. దీంతో వాహనదారులను ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమంలో కారోబార్ వెంకన్న తండావాసులు గుగులోతు రవి,రాజు నాయక్,శ్రీనివాస్, గోపీచంద్,సుకిని తదితరులు పాల్గొన్నారు.