ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్ల హైదరాబాద్ యూనిట్ ఏర్పాటు

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ చేసి హైదరాబాదు లో స్థిరపడిన పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఎస్‌జీపీఏ) హైదరాబాద్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్. లూక్, కన్వీనర్‌గా సి.హెచ్. అజయ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం. అంజి ప్రసాద్ రావు, కోశాధికారిగా కె. వసంతరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఆర్. లూక్ మాట్లాడుతూ, హైదరాబాదు లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యూనిట్ అవసరమని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కార్డులు (ఈహెచ్‌ఎస్) అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ, పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, జూలై 26న జరిగే కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. ల్యాక్, ప్రభుదాస్, వెంకటేశ్వర్లు, సి.హెచ్. అజయ్ కుమార్, ఎం. అంజి ప్రసాద్ రావు, కె. వసంతరావు, సి. శ్రీనివాసరావు, ఎ. బాబూజీ, జి. కిషోర్, ఎ.వి. అనిల్ కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/establishment-of-hyderabad-unit-of-andhra-pradesh-pensioners/article-18251

Tags: