రూ. 50 వేల విలువ చేసే మద్యం పట్టివేత
- ముగ్గురి అరెస్టు..
విశ్వంభర, జిహెచ్ ఎం సి : సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ, తార్నక ప్రాంతాల్లో ఆంగ్లో ఇండియన్లు ఎలాంటి అనుమతులు లేకుండా వైన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య సిబ్బంది రెండు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కేసుల్లో ఒక ఇంటిలో 25 వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆంటోని ని అరెస్టు చేశారు. ఆర్టీసీ హాస్పటల్ తార్నాక ప్రాంతంలో 20 లీటర్ల వైన్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో వేణు, ప్రకాష్‌లను అరెస్టు చేశారు. పట్టుకున్న వైన్ విలువ రూ. 50 వేలుగా ఉంటుందని అంచనా వేశారు. నిందితులను వైన్‌ను, సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.