కేజీబీవీ, మోడల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
విశ్వంభర, గుండాల: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్ లను కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారము ఆకస్మికంగా తనిఖీ చేశారు. కసుర్బా గాంధీ పాఠశాలలో చేపడుతున్న మరమ్మతు (సివిల్) పనుల గురించి ఎస్ ఓ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు, త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు, అనంతరము కేజీబీవి లో తరగతి గది పరిశీలనలో ఆరవ తరగతి విద్యార్థిని చదివించినారు, బాలికల హాస్టల్ గదులను, కిచెన్ షెడ్ ను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినారు, తదనంతరము మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ సందర్శించి మాట్లాడుతూ ప్రాంగణం ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించినారు, అక్కడ ఉన్న నిర్వాహకులు కేర్ టేకర్ కావాలని కోరగా పరిశీలిస్తానన్నాడు, అనంతరం మోడల్ స్కూల్ లో తరగతి గదులను పరిశీలిస్తూ, బాలుర ,బాలికల మరుగుదొడ్లను పరిశీలించి ప్రిన్సిపల్ రాము పై అసహనం వ్యక్తం చేశాడు , ఏం శ్రీనిధులు, స్కూల్ గ్రాంట్ వచ్చిన ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని అడిగారు, దీనిపై స్పెషల్ ఎంక్వయిరీ కమిటీని పంపిస్తా అన్నాడు, రెండు రోజులలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బొల్లారం .బిక్షపతి, మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు, గుండాల సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య ,ఎంపీడీవో చండీరాణి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఆర్ .విజయలక్ష్మి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాము,పి ఆర్ ఏ ఈ ఆర్ దామోదర్,సిడిపిఓ నాజి, సి ఆర్ పి దేవన బోయిన. లింగయ్య తదితరులు పాల్గొన్నారు