గెస్ట్ లెక్చరర్ల వేతనాలు పెంచాలి: జాన్ వెస్లీ
విశ్వంభర, హైదరాబాదు : గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలకు ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.50 వేల వేతనం అమలు చేసి, ఖాళీ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 1,240 మంది గెస్ట్ లెక్చరర్లు ప్రస్తుతం రూ.28 వేల వేతనంతోనే విధులు నిర్వహిస్తున్నారని, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 1,940 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యాబోధనపై ప్రభావం పడుతోందని తెలిపారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే గెస్ట్ లెక్చరర్లకు సాధారణ సెలవులు, ఉద్యోగ భద్రత వంటి కనీస హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని జాన్ వెస్లీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు