వృత్తితో పాటు సాహిత్య సృజన అభినందనీయం
విశ్వంభర, హైదరాబాదు: వృత్తి ఏదైనా సాహిత్య సృజనను నిరంతరం కొనసాగించే వారే నిజమైన సాహితీవేత్తలని తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు డా. కె.వి. రమణ అన్నారు. నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో డా. దేవరాజు రాంభావు రచించిన "భరతోదయం" మహాపద్యకావ్య గ్రంథావిష్కరణ సభకు సంబంధించిన గోడపత్రికను మంగళవారం హైదరాబాదులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. కె.వి. రమణ మాట్లాడుతూ, ఔషధ శాస్త్ర ఆచార్యుడైన డా. దేవరాజు రాంభావు తన గురువు మహాకవి వానమామలై వరదాచార్య ప్రేరణతో 770 పేజీల మహాపద్యకావ్యాన్ని రచించడం అభినందనీయమన్నారు. నవ్య సాహితీ సమితి అధ్యక్షుడు డా. ఆచార్య ఫణీంద్ర మాట్లాడుతూ, డా. రాంభావు 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని మహాకావ్య గ్రంథావిష్కరణ సభ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. డా. దేవరాజు రాంభావు మాట్లాడుతూ, సాహిత్యానికి విశేష ప్రోత్సాహం అందిస్తున్న డా. కె.వి. రమణ సేవలు ప్రశంసనీయమని అన్నారు. నవ్య సాహితీ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు వేమరాజు విజయకుమార్ మాట్లాడుతూ, ఈ నెల 12న సత్యసాయి నిగమాగమంలో జరిగే గ్రంథావిష్కరణ సభను విజయవంతం చేయాలని సాహిత్యాభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డా. కె.వి. రమణ, డా. దేవరాజు రాంభావు, డా. ఆచార్య ఫణీంద్ర, ఆచార్య వంగపల్లి విశ్వనాథం, మాధవరెడ్డి, సూర్యనారాయణ మూర్తి, వేమరాజు విజయకుమార్, డా. నండూరి విద్యారణ్య స్వామి, డా. కుసుమకుమారి, డా. దేవరాజు రాంభావు శిష్యులు, కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.