ఏబీవీపీ పిలుపుతో హుస్నాబాద్ లో పాఠశాలలు బంద్

విశ్వంభర, హుస్నాబాద్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ పిలుపు మేరకు హుస్నాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విజయవంతంగా బంద్ నిర్వహించాయి . విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే డిమాండ్‌తో ఈ బంద్ చేపట్టినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ హుస్నాబాద్ నగర కార్యదర్శి బత్తుల రాజు మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులు, విద్యా ప్రమాణాల పరిరక్షణ కోసం ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మండలంలోని పాఠశాలలు బంద్‌కు సహకరించినందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ భీమగోని చరణ్, నగర ఉపాధ్యక్షుడు బావు అంజి, నగర సంయుక్త కార్యదర్శి అరుణ్, కుమార్, శరత్, వంశీ, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/schools-closed-in-husnabad-on-the-call-of-abvp/article-17060

Tags: