కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించిన  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

విశ్వంభర, పరిగి: పూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ.3 కోట్ల 25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు,ఆధునిక వసతులు కల్పిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పరిగిలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని  తెలిపారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అత్యాధునిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకేచోట నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు.విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ఆధునిక సదుపాయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా మైదానాలతో కూడిన వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,కడుమూరి ఆనందం, మన్నెగూడ సర్పంచ్ అజీమ్ పటేల్, కాంగ్రెస్ నాయకులు అజరుద్దీన్, శ్రీనివాస్, అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-reddy-inaugurated-the-new-building-of-kgbv/article-18229

Tags: