పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు ఉద్యమించాలి: జేఏసీ
విశ్వంభర, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, రైతులు, మేధావులు, ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధం కావాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. దేవరకద్రలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కో-చైర్మన్ బెక్కం జనార్దన్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి సంవత్సరాలు గడిచినా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా పలు ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదని విమర్శించారు. జిల్లాకు న్యాయమైన నీటి కేటాయింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకుడు చెన్న కిష్టయ్య మాట్లాడుతూ ఈ నెల 19న మహబూబ్‌నగర్‌లోని క్రౌన్ ఫంక్షన్ గార్డెన్‌లో విస్తృత రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. ఖలీల్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు సాంబశివుడు, బీడీ కార్మిక సంఘం నాయకుడు పి. యాదగిరి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే సాగునీటితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాది ఆర్.ఆర్. మన్యం, కృష్ణయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.