జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి

  • జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు: టీడబ్ల్యూజేఎఫ్

విశ్వంభర, హైదరాబాదు:  రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా "జర్నలిస్టుల వినతులు" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు చార్జీల్లో మూడోవంతు రాయితీ ప్రకటించినప్పటికీ, టోల్ ఫీజు, సర్వీస్ చార్జీల పేరుతో ఆర్టీసీ దాదాపు 50 శాతం చార్జీలు వసూలు చేస్తోందని వారు ఆరోపించారు. దీంతో వార్తల సేకరణ కోసం ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే జర్నలిస్టులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టులు తక్కువ వేతనాలతో ప్రజలకు, ప్రభుత్వానికి సేవలందిస్తున్నారని, అలాంటి వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ప్రభుత్వంపై లేదా ఆర్టీసీపై పెద్దగా ఆర్థిక భారం ఉండదని పేర్కొన్నారు. ఈ నెల 10న రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు రాష్ట్రవ్యాప్తంగా వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/journalists-should-be-provided-free-travel-in-rtc-buses/article-18263

Tags: