ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ అవసరం : ప్రొఫెసర్ హరగోపాల్

విశ్వంభర, హైదరాబాదు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే విద్యా వ్యవస్థ పురోగతికి కీలకమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాదులో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, విద్యా నాణ్యత పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు దీర్ఘకాలిక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యా విధానంలో చేపట్టే సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర మూర్తి, ప్రమోద్ రాయిత, సిద్దారెడ్డి, డాక్టర్ వసుముల, ప్రొఫెసర్ అస్నార్ ఖాన్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్, పీడీఎస్‌యూ నాయకులు పి. మహేష్, రామచందర్, ప్రొఫెసర్ ఎం. ప్రసాద్, విద్యావేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/prof-haragopal-said-comprehensive-action-is-needed-to-strengthen-government/article-18217

Tags: