కామక్కపల్లి గ్రామ పికెట్‌ను తనిఖీ చేసిన రూరల్ సి ఐ
విశ్వంభర, కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లి గ్రామ పికెట్‌ను రూరల్ సి ఐ గంగాధర్ సందర్శించి తనిఖీ నిర్వహించారు. పికెట్‌లో ఉన్న సిబ్బందికి విధుల నిర్వహణ, అప్రమత్తత గురించి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే అంశాలపై ఆయన సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి చర్చించి గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాను. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ధరించడం, వాహన సీటుబెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు వివరిస్తూ అలాగే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులకు సహకరించాలని తెలిపారు.