విబిజిరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని వినతి

విశ్వంభర,ఇనుగుర్తి: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విబిజిరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నేత గొడిషాల వెంకన్న ఆధ్వర్యంలో మండలంలోని చిన్ననాగారం గ్రామ పంచాయతీ లో జిపి కార్యదర్శి పిట్టల శేఖర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ విబిజీరామ్జి చట్టం తీసుకురావడం ఉపాధి కూలీలకు పని లేకుండా చేసే పెద్ద కుట్ర అన్నారు. ఎంతో పోరాడి సాధించుకున్న ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించి విబిజిరాంజీ చట్టాన్ని తేవడం దారుణం అన్నారు. కార్యక్రమంలో జిపిఓ యాకయ్య, కరోబార్ కురిమెల యాకన్న,మద్దెల యాకయ్య,భారతమ్మ,పోలోజు కలమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-petition-to-repeal-the-vibjiranji-act/article-18221

Tags: