అయోధ్య కానుకల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలి

విశ్వంభర, మహబూబాబాద్ : అయోధ్య రామ మందిరం కానుకల వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. రామ మందిరానికి భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని, ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. దేవాలయాల ఆస్తులు, నిధుల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్ సారథి, నన్ను సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, ఓం భిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావుతో పాటు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cbi-should-investigate-the-allegations-of-ayodhya-gifts/article-18186

Tags: