ప్రజాపథంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం

  • జూలై 9 నుంచి ముషీరాబాదులో కార్యక్రమానికి శ్రీకారం

విశ్వంభర, ముషీరాబాదు :తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సికింద్రాబాదు పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాదు నగర పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి రాష్ట్ర నాయకులు శ్రీపతి సతీష్, పోలపల్లి అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జూలై 9 నుంచి ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్‌లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద "తెలుగుదేశం–ప్రజాపథం" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రతి డివిజన్‌లో 50 నుంచి 100 మంది చురుకైన కార్యకర్తలను సిద్ధం చేసి, స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ పార్టీని ప్రజల్లో బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాదు పార్లమెంట్ పరిధిలోని 38 డివిజన్లలో రెండు రోజులకు ఒక డివిజన్ చొప్పున కార్యక్రమాలు నిర్వహించి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడమే లక్ష్యమని నల్లెల్ల కిషోర్, పి. బాలరాజ్ గౌడ్ వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ పూర్వవైభవం కోసం సమిష్టిగా కృషి చేయాలని నల్లెల్ల కిషోర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.కె. బోసు, కాసుల సుదర్శన్ రెడ్డి, ప్రమీల, తడక వినోద్, శ్యామ్ సుందర్, పరుశురామ్, భాను ప్రకాష్, ఎం. రాజు, పి. బాలకృష్ణ, చంద్రమోహన్ గౌడ్, సి. విఠ్ఠల్, భవాని శ్రీనివాస్, గండికోట విజయ్, మల్లిఖార్జున్, సత్యనారాయణ, బి. రాజు, రవి, సత్తన్న, అనిల్, ఎస్. ప్రకాష్, యాదగిరి, శక్తి ప్రేమ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/strengthening-the-party-at-the-field-level-with-prajapatha/article-18271

Tags: