వాహనదారులకు ఆర్‌టీఏ అలర్ట్.. 

వాహనదారులకు ఆర్‌టీఏ అలర్ట్.. 

  • పత్రాలు లేకపోతే కేసులు నమోదు, భారీ ఫైన్లు ఖాయం
    : జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ హెచ్చరిక 

విశ్వంభర,మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా రవాణా అధికారి (డీటీఓ) శంకర్ నాయక్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలను వెంట ఉంచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన సుమారు 7 వేల ఆటోరిక్షాల యజమానులు తమ వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. తనిఖీల సమయంలో ఈ పత్రాలు లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కమర్షియల్ వాహనాల యజమానులు త్రైమాసిక పన్నులను సకాలంలో చెల్లించాలని, పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధిస్తామని జిల్లా రవాణా అధికారి హెచ్చరించారు. వ్యవసాయ అవసరాల కోసం రిజిస్ట్రేషన్ పొందిన ట్రాక్టర్లను కమర్షియల్ పనులకు వినియోగించరాదని హెచ్చరించారు. కమర్షియల్ వినియోగానికి నమోదైన ట్రాక్టర్–ట్రైలర్లకు ప్రతి మూడు నెలలకు త్రైమాసిక పన్ను చెల్లించడంతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కంప్రెసర్లు, రోటావేటర్లు అమర్చిన ట్రాక్టర్లకు కూడా త్రైమాసిక పన్ను, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే స్కూల్ బస్సుల యజమానులు ప్రతి మూడు నెలలకు త్రైమాసిక పన్ను చెల్లించి, ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ పత్రాలను ఎప్పటికప్పుడు చెల్లుబాటులో ఉంచాలని సూచించారు. కొత్తగా కొనుగోలు చేసిన ప్రతి వాహనాన్ని టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) గడువు ముగియకముందే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా రవాణా అధికారి తెలిపారు. వాహన పన్నులను సమీపంలోని మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ సేవలు లేదా మొబైల్ ఫోన్ ద్వారా సకాలంలో చెల్లించుకోవచ్చని వివరించారు. ఆర్‌టీఏ అధికారులు నిర్వహించే తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తామని శంకర్ నాయక్ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలందరూ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు, పన్నుల రసీదులు ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకుని, కమర్షియల్ వాహనాల త్రైమాసిక పన్నులను గడువులోపు చెల్లించి, రవాణా శాఖ నిబంధనలను పాటించాలని జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rta-alert-for-motorists/article-18238

Tags: