పబ్లిక్ స్కూల్ ను వేరే చోటికి తరలించొద్దు: సిపిఎం
విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ ను వేరే మండలానికి తరలించాలనే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసిల్దార్ చంద నరేష్ కు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో వెనుక బడినవి ఈ ప్రాంతానికి మంజూరు చేసిన సంబంధిత పాఠశాలను తరలించాలని చూడడం దారుణమన్నారు. వెంటనే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తూ పేద విద్యార్థుల కోసం హాస్టల్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విక్రమ్,వంశీ,శరత్,జస్వంత్,కార్తీక్,సిద్దు, చరణ్ పాల్గొన్నారు.